astrologyvasavi@gmail.com+91 70752 61848

అంగారక అష్టోత్తర శత నామ స్తోత్రం

మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః । మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః ॥ 1 ॥

మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః । మానదోఽమర్షణః క్రూరస్తాపపాపవివర్జితః ॥ 2 ॥

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః । వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ ॥ 3 ॥

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః । నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః ॥ 4 ॥

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః । అక్షీణఫలదః చక్షుర్గోచరః శుభలక్షణః ॥ 5 ॥

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః । నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః ॥ 6 ॥

కమనీయో దయాసారః కనత్కనకభూషణః । భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః ॥ 7 ॥

శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః । సాహసః సద్గుణాఽధ్యక్షః సాధుః సమరదుర్జయః ॥ 8 ॥

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః । దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః ॥ 9 ॥

దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః । భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః ॥ 10 ॥

రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః । చతుర్భుజో గదాధారీ మేషవాహోఽమితాశనః ॥ 11 ॥

శక్తిశూలధరః శక్తః శస్త్రవిద్యావిశారదః । తార్కికస్తామసాధారస్తపస్వీ తామ్రలోచనః ॥ 12 ॥

తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసన్నిభః । గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః ॥ 13 ॥

అసృగంగారకోఽవంతీదేశాధీశో జనార్దనః । సూర్యయామ్యప్రదేశస్థో యౌవనో యామ్యదిఙ్ముఖః ॥ 14 ॥

త్రికోణమండలగతస్త్రిదశాధిపసన్నుతః । శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః ॥ 15 ॥

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః । సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః ॥ 16 ॥

ఇతి శ్రీ అంగారకాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।